కన్నడలో రిషబ్ శెట్టి హీరో గా, దర్శకుడిగా తెరకెక్కిన కాంతార చాప్టర్ 1 చిత్రం ఈ దసరా స్పెషల్ గా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 న వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకు వచ్చింది. భారీ అంచనాలు నడుమ పాన్ ఇండియా మార్కెట్ లో విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజు గ్రాండ్ ఓపెనింగ్స్ వచ్చాయి.
వరల్డ్ వైడ్ గా మొదటి రోజు కాంతార చాప్టర్1.. 89 కోట్లు లను కొల్లగొట్టినట్టుగా కాంతార మేకర్స్ స్పెషల్ పోస్టర్ తో ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా కన్నడ కాంతార1 కు డే 1 89 కోట్ల గ్రాస్ వచ్చినట్లుగా ప్రకటించారు. రిషబ్ శెట్టి యాక్టింగ్, అలాగే కాంతారా చాప్టర్ 1క్లైమాక్స్ సినిమాకి బలంగా మారాయి. ఫస్ట్ హాఫ్ వీక్ అయినా రిషబ్ పెరఫార్మెన్స్ సినిమాని నిలబెట్టింది.
ప్రస్తుతం దసరా హాలిడేస్ కలిసి రావడంతో కాంతార రెండో రోజు కూడా స్ట్రాంగ్ బుకింగ్స్ తో దూసుకుపోతుంది. మరి ఫస్ట్ వీకెండ్ గడిచేసరికి కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్ పెరగడం ఖాయమంటున్నారు ట్రేడ్ నిపుణులు. చూద్దాం కాంతార1 కలెక్షన్స్ ఎక్కడివరకు వెళ్లి ఆగుతాయో అనేది.