సమంత సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది కానీ.. సినిమా సెట్ లో కనిపించి చాలా కాలమే అయ్యింది. పని వెంట పరుగులు తీస్తూ అదే లైఫ్ అనుకున్నాను, కానీ సక్సెస్ అంటే ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండడమే అని తెలుసుకున్నాను అంటూ లైఫ్ లెసెన్స్ మాట్లాడుతున్న సమంత తాజాగా న్యూ జర్నీ అంటూ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.
న్యూ జర్నీ అంటూ సమంత తన కొత్తింటి ఫొటోను సోషల్ మీడియా లో షేర్ చేసింది. ఆ ఇంటి గోడపై సమంత నిక్నేమ్ SAM లోగో ప్రత్యేక ఆకర్షణగా కనిపించింది. అయితే సమంత ఆ కొత్తింటిని ముంబై లో కొనిందా లేదంటే హైదరాబాద్ లో కొత్తిల్లు తీసుకుందా అనేది తెలియక ఆమె అభిమానులు తికమకపడుతున్నారు.
కానీ చాలామంది మాత్రం సమంత ముంబై లోనే కొత్తింటిని కొనుగోలు చేసింది. ఆమె అక్కడ ఉండడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది, రాజ్ నిడమోరు తో సమంత ముంబైలోని ఆ కొత్తింట్లోనే కొత్త జర్నీ స్టార్ట్ చేస్తుంది అంటూ మాట్లాడుకుంటున్నారు.