ఈ నెల 31 న రవితేజ మాస్ జాతర తో రచ్చ చేసేందుకు రెడీ అవుతున్నారు. పదే పదే విడుదల తేదీలను మార్చుకుంటూ వచ్చిన మాస్ జాతర ఫైనల్ గా అక్టోబర్ 31 న రిలీజ్ అంటూ రవితేజ జబర్దస్త్ ఆది తో కలిసి ఓ వీడియో తో అనౌన్స్ చేసారు. ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి.
మాస్ జాతర తర్వాత మరో రెండు నెలల్లో అంటే 2026 సంక్రాంతికి రవితేజ మరో సినిమాని రెడీ చేసేస్తున్నారు. సంక్రాంతి టార్గెట్ గా సైలెంట్ గా రవితేజ మరో సినిమా షూటింగ్ చాలావరకు పూర్తి చేసేసారు. ఈ చిత్రానికి మేకర్స్ వెరైటీ టైటిల్ పెట్టబోతున్నారు. అదే భక్త మహాశయులకు విజ్ఞప్తి అని గుడిలో పంతులుగారు చెప్పినట్టుగా భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే టైటిల్ చూజ్ చేసుకున్నారట.
మరి భర్త మహాశయులకు విజ్ఞప్తి టైటిల్ వినేందుకు చాలా వెరైటీ గా ఆడియన్స్ త్వరగా కనెక్ట్ అయ్యేదిలా ఉంది కదా.. సో ఓ శుభ ముహూర్తంలో ఈ రవితేజ కొత్త సినిమా టైటిల్ తో పాటుగా భర్త మహాశయులకు విజ్ఞప్తి రిలీజ్ డేట్ ని లాక్ చేస్తారని సమాచారం.