Advertisementt

అనిల్ రావిపూడికి పోటికొస్తున్న కుర్ర హీరో

Thu 02nd Oct 2025 07:45 PM
anaganaganaga oka raju  అనిల్ రావిపూడికి పోటికొస్తున్న కుర్ర హీరో
Anil Ravipudi vs Naveen Polishetty అనిల్ రావిపూడికి పోటికొస్తున్న కుర్ర హీరో
Advertisement
Ads by CJ

ప్రమోషన్స్ విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి ని కొట్టే దర్శకుడే లేరు. అంత ప్రమోషనల్ స్ట్రాటజీ ని అనిల్ రావిపూడి తన సినిమాలకు అప్లై చేస్తారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం అంత పెద్ద హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అనిల్ రావిపూడి డిఫ్రెంట్ ప్రమోషన్స్ అనే చెప్పాలి. 

ఇప్పుడు మెగాస్టార్ చిరు తో చేస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం ఓపెనింగ్ నుంచే తన ప్రమోషన్స్ మొదలు పెట్టేసాడు అనిల్ రావిపూడి. నయనతారను ఈ ప్రాజెక్ట్ లోకి తేవడం దగ్గర నుంచి సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని చెప్పడమే కాదు.. ఈ దసరా నుంచే ధూమ్ ధామ్ ప్రమోషన్స్ మొదలు పెట్టేసారు. శంకర్ వర ప్రసాద్ నుంచి ఫస్ట్ డ్యూయెట్ వదిలేసారు. 

అంతలాంటి అనిల్ రావిపూడి కి ఇప్పుడొక కుర్ర హీరో ఫుల్ కాంపిటీషన్ వచ్చేసాడు. అతనే నవీన్ పోలిశెట్టి. కామెడీకి కేరాఫ్ గా నిలిచే ఈ హీరో సంక్రాంతికి అనగనగ ఒక రాజు చిత్రంతో ప్రభాస్ రాజా సాబ్, మన శంకర్ వరప్రసాద్ చిత్రాలతో పోటీపడుతున్నారు. మరి అంత పెద్ద సినిమాల్తో పోటీపడడం అంటే ఇప్పటినుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యాలి. 

అందుకే సంక్రాంతి టీజర్ అంటూ నవీన్ అందరి చూపు తన సినిమాపై ఉండేలా ప్లాన్ చెయ్యడమే కాదు మన శంకర్ వరప్రసాద్ కి పోటీగా ఈ దసరా నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసాడు. సో అనిల్ రావిపూడి కి నవీన్ పోలిశెట్టి గట్టి పోటీనే.. అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. 

Anil Ravipudi vs Naveen Polishetty:

Mana Shankara Vara Prasad Garu vs Anaganaganaga Oka Raju

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ