గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ చాలా డెడికేషన్ తో బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది మూవీ చేస్తున్నారు. పాన్ ఇండియా మార్కెట్ లో భారీ అంచనాలున్న పెద్ది ఫస్ట్ షాట్ ఎంతగా ట్రెండ్ అయ్యిందో, రామ్ చరణ్ మాస్ లుక్స్ కి ఎంత మంది ఫ్యాన్స్ అయ్యారో చూసారు.
లాంగ్ హెయిర్, చెవికి రింగ్ తో వింటేజ్ స్టయిల్ తో రామ్ చరణ్ పెద్ది లుక్ మాత్రం ఇంప్రెస్స్ చేసేదిలా ఉంది. పెద్ది స్టార్ట్ చేసాక రామ్ చరణ్ పెద్ది లుక్ లోనే కంటిన్యూ అవుతున్నారు. బయట ఎక్కడ కనిపించినా పెరిగిన హెయిర్ స్టయిల్ తోనే చరణ్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నారు.
తాజాగా ఆయన ఎయిర్ పోర్ట్ లో వెళుతున్న లుక్స్ ని ఎడిట్ చేసి వదిలారు మెగా ఫ్యాన్స్. రామ్ చరణ్ దసరా సందర్భంగా పెద్ది లుక్ లోనే ఫెస్టివ్ వైబ్స్ తో కనిపించారు. నుదుటున బొట్టు, కూలింగ్ గ్లాసెస్ తో చరణ్ లుక్ చూసి మెగా ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు.