యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది, హీరో నార్ని నితిన్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఎన్టీఆర్ భార్య ప్రణతి కి తమ్ముడు అయిన నార్నె నితిన్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. కొద్దినెలల క్రితమే నార్నె నితిన్-శివాని ఎంగేజ్మెంట్ కుటుంబ సభ్యులు, సన్నహితుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది.
ఇప్పుడు నార్నె నితిన్-శివాని పెళ్ళికి ముహూర్తం పెట్టేసారు. అది ఈనెల అంటే అక్టోబర్ 10 న హైదరాబాద్ లో నార్నె నితిన్-శివాని ల వివాహం జరగనుంది. ఈ పెళ్ళికి సినీ ప్రముఖులు చాలామంది హాజరవుతారని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం షూటింగ్స్ కి హాజరవ్వడం లేదు.
రీసెంట్ గానే ఎన్టీఆర్ యాడ్ షూట్ లో గాయపడి రెస్ట్ తీసుకుంటున్నారు. ఆ గాయాలతోనే రీసెంట్ గా కాంతార ఈవెంట్ కి హాజరయ్యారు. అప్పుడు ఆయన తనకు తగిలిన గాయాలతో ఇబ్బందిపడడం చూసి అభిమానులు కలత చెందారు. త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. సో బావమరిది పెళ్లిలో ఎన్టీఆర్ ఫుల్ గా సందడి చేస్తారన్నమాట.