పవన్ తో పని చెయ్యాలంటే ఆలోచించాలి

Thu 02nd Oct 2025 04:42 PM
og 2  పవన్ తో పని చెయ్యాలంటే ఆలోచించాలి
You have to think about working with Pawan పవన్ తో పని చెయ్యాలంటే ఆలోచించాలి
Advertisement
Ads by CJ

పవన్ రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు చేసారు. కానీ అధికారంలోకి వచ్చాక సినిమాలు పూర్తి చెయ్యడానికి చాలా సమయం తీసుకున్నారు. మూడు సినిమాలను సెట్స్ పై పెట్టి ఆయన ప్రజలకు సేవ చెయ్యడానికి వెళ్లిపోయారు. కూటమి కట్టి ప్రభుత్వంలో కీలకంగా మారి ఓ ఏడాది పాటు పాలన అందించిన తర్వాత తన కమిట్మెంట్స్ పూర్తి చేసారు పవన్. 

అటు సినిమాలు, ఇటు ప్రజల కోసం పని చెయ్యడమంటే మాములు విషయం కాదు, ఉంటే పూర్తిగా రాజకీయాల్లో ఉండాలి, లేదంటే సినిమాలు చేసుకోవాలి, సినిమాల్లో నటిస్తూ ప్రజలను పాలనను గాలికొదిలేస్తున్నారంటూ ప్రతిపక్షాలు పవన్ ను దుమ్మెత్తిపోస్తున్నాయి. నిజమే షూటింగ్ చెయ్యాలంటే అటు రాజకీయాలను పక్కనపెట్టాలి. 

మరి వీరమల్లు, OG సినిమాలు వచ్చేసాయి, ఇక ఉస్తాద్ భగత్ సింగ్ రాక మిగిలి ఉంది. అటు OG సీక్వెల్ ఉంటుంది అని పవన్ చెప్పారు. థమన్, సుజిత్ తో కలిసి OG సీక్వెల్ పై కూర్చుంటామన్నారు. మరి పవన్ డేట్స్ పట్టుకుని సుజిత్ ఇంకెంత కాలం వెయిట్ చెయ్యాలి. ఇకపై డిప్యూటీ సీఎం పవన్ తో పని చెయ్యాలంటే దర్శకులు, నిర్మాతలు బాగా అలోచించి స్టెప్ వెయ్యాలి, వేసాక పవన్ తో పాటు ప్రయాణం చెయ్యాలి, చూద్దాం ఇకపై పవన్ సినిమాల విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో అనేది.. 

You have to think about working with Pawan:

OG 2 could be Pawan Kalyan next film

Tags:   OG 2
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ