కింగ్ ఖాన్ షారూఖ్ ప్రపంచంలోనే నంబర్ వన్ సంపాదకుడిగా రికార్డు సృష్టించారు. టేలర్ స్విఫ్ట్, ఆర్నాల్డ్ స్క్వాజ్ నెగ్గర్, జెర్రీ సీన్ ఫెల్డ్, సెలీనా గోమేజ్ వంటి హాలీవుడ్ దిగ్గజ తారలను సంపదల్లో మించిపోయాడు.
కింగ్ ఖాన్ బిలియనీర్ ల జాబితాలో చేరాడు. ఇప్పుడు అతడి సంపదల విలువ 12,490 కోట్లు. ఇది సుమారు 1.4 బిలియన్ డాలర్లు.
33 ఏళ్ల సినీ కెరీర్ లో అతడు అగ్ర కథానాయకుడిగా భారీగా ఆర్జించాడు. దీనికి తోడు రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ సహా సొంత వీఎఫ్ ఎక్స్ కంపెనీలు, విదేశాల్లో రియల్ వెంచర్లు, క్రికెట్ టీమ్ లపై రెవెన్యూ రూపంలో ఖాన్ భారీగా ఆర్జిస్తున్నాడు. కేవలం ఏడాదిలోనే 800 మిలియన్ల డాలర్ల ఆదాయం నుంచి ఇప్పుడు 1.4 బిలియన్ డాలర్ల రేంజుకు ఎదిగాడు. 1.3 బిలియన్ డాలర్లతో టేలర్ స్విఫ్ట్ రెండో స్థానంలో నిలవగా, 1.2 బిలియన్ డాలర్లతో ఆర్నాల్డ్ తర్వాతి స్థానంలో నిలిచారు.
1.2 బిలియన్ డార్లతో జెర్రీ సీన్ ఫెల్డ్, 720 మిలియన్ డాలర్లతో సెలీనా గోమెజ్ కూడా టాప్ 5లో చోటు సంపాదించుకున్నారు. ప్రఖ్యాత హురూన్ సర్వే ప్రకారం ఈ వివరాలు వెల్లడయ్యాయి. బాలీవుడ్ తారల్లో జూహీ చావ్లా ఫ్యామిలీకి 7,790 కోట్ల నికర ఆస్తులతో ఖాన్ తర్వాత పెద్ద స్థాయిలో ఉన్నారు. హృతిక్ రోషన్ రూ. 2,160 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు.