బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సుభాష్ ఘయ్ తనను లైంగికంగా వేధించాడంటూ ఆరోపించింది మోడల్ కం నటి నేహల్. ఒక సాయంత్రం సమయాన తన ప్రియుడితో కలిసి సుభాష్ జీ ఇంట్లోనే వైన్ సిప్ చేస్తుంటే అతడు మొదట తనన తప్పుగా చూసాడని, చాలా అందంగా సెక్సీగా ఉన్నావని వ్యాఖ్యానించాడని ఆరోపించింది.
ఆ తర్వాత తాను బాత్రూమ్ లోకి వెళ్లినప్పుడు పరిస్థితి మరింత దిగజారిపోయిందని కూడా తెలిపింది. బాత్రూమ్ లో ప్రవేశించిన తర్వాత అతడు నా దగ్గరకు వచ్చాడు. వెనక నుంచి దగ్గరగా వచ్చి బుగ్గపై ముద్దు పెట్టాడు. నా పెదవులపైనా ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించిన విషయాన్ని నా ప్రియుడికి చెప్పాను. ఇదంతా అతడికి తెలిసే జరిగినందున ఆ రోజుతో అతడితో బ్రేకప్ అయిందని తెలిపింది నేహల్.
అయితే తనపై ఆరోపించిన నటిపై ఇప్పటివరకూ సుభాష్ ఘాయ్ స్పందించలేదు. ఇప్పుడు అతడు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రతిదాడికి దిగాడు. తనపై తప్పుడు ఆరోపణలు చేసే ఎవరికైనా శిక్ష కఠినంగా ఉంటుందని కూడా ఘాయ్ అన్నారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు దిగజార్చడానికి అలాంటి ఆరోపణలు చేసారని తెలిపారు. తనపైనా తన కంపెనీపైనా, తన సిబ్బందిపైనా తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రతిదాడికి దిగారు. తప్పు జరిగినట్టు అనిపిస్తే సంబంధిత పోలీసులు, అధికారులకు మాత్రమే ఫిర్యాదు చేయాలి కానీ, సోషల్ మీడియాల్లో తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పు దారి పట్టించుకూడదని అది చట్టవిరుద్ధమని కూడా ఘాయ్ తన నోట్ లో పేర్కొన్నారు.