పవన్ కళ్యాణ్ ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హరి హర వీరమల్లు రిజల్ట్ ఎలా ఉన్నా OG సక్సెస్ ను పవన్ ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ OG ని ప్రత్యేకంగా వీక్షించారు. చిరు శెభాష్ అన్నారు. ఇక OG ని ప్రమోట్ చెయ్యడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత పవన్ వైరల్ ఫీవర్ తో సతమతమయ్యారు.
ఇక OG హిట్ అవడంతో మేకర్స్ గ్రాండ్ గా OG సక్సెస్ సెలెబ్రేషన్స్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కి పవన్ రాయల్ గా OG లుక్ లో ఎంట్రీ ఇచ్చారు. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన దిల్ రాజు మట్లాడుతూ.. నాకు ఎప్పుడైనా అపజయం వచ్చినప్పుడు.. విజయం వచ్చేవరకు పవన్ కళ్యాణ్ గారే నాకు ఇన్స్పిరేషన్(పదేళ్ళుగా జనసేన పార్టీ పెట్టి పోరాడి ఫైనల్ గా గెలిచి ఏపీ ప్రభుత్వంలో పవన్ కీలకంగా ఉన్నారు.)
మా అందరిది ఒకటే రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ గారు.. మీరు(రాజకీయాల్లో) ఎంత బిజీ గా ఉన్నా.. సంవత్సరానికి ఒక సినిమా చెయ్యండి అంటూ దిల్ రాజు OG సక్సెస్ సెలెబ్రేషన్స్ స్టేజ్ పై నుంచి పవన్ ను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసారు. మరి దిల్ రాజు రిక్వెస్ట్ ను పవన్ ఎంతవరకు పట్టించుకుంటారో చూడాలి.