అవును రీసెంట్ గా బ్లాక్ బస్టర్ అయిన హిట్ సినిమాలో క్యూట్ అండ్ స్వీట్ హీరోయిన్ పేరు అస్సలు వినిపించకపోవడం నిజంగా ఆశ్చర్యకరమే అని చెప్పాలి. అదెవరిదో కాదు పవన్ కళ్యాణ్ OG. పవర్ స్టార్ సినిమాల్లో హీరోయిన్స్ కి ఎంత హైప్ ఇచ్చిన పవన్ క్రేజ్ ముందు తేలిపోవాల్సిందే. అదే జరిగింది ఈ సినిమాలో నటించిన హీరోయిన్ ప్రియాంక మోహన్ విషయంలో.
OG లో ఓ గ్యాంగ్ స్టర్ కి భార్య గా సింపుల్ కేరెక్టర్ లో కనిపించిన ప్రియాంక మోహన్ రోల్ బావున్నా, లుక్స్ బావున్నా ఆ పాత్రను కూరలో కర్వేపాకు మాదిరి తీసిపడేసాడు దర్శకుడు సుజిత్. కన్మణి పాత్రలో ఆకర్షణగా కనిపించింది, కానీ నిడివి తక్కువున్న పాత్ర ఆమెను హైలెట్ అవ్వనివ్వలేదు.
అందులోను OG హిట్ క్రెడిట్ మొత్తం పవన్ కళ్యాణ్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, దర్శకుడు సుజిత్ ఖాతాల్లోకి వెళ్లిపోవడము, ప్రియాంక పాత్ర ను తొక్కేశాయి. అందుకే OG హిట్ అంటున్నా ప్రియాంక పేరు ఎక్కడా వినిపించడం లేదు కనిపించడం లేదు.