Advertisementt

MSG : నయనతార బ్యూటిఫుల్ లుక్

Wed 01st Oct 2025 11:57 AM
nayanthara  MSG : నయనతార బ్యూటిఫుల్ లుక్
Nayanthara As Sasirekha In MSG MSG : నయనతార బ్యూటిఫుల్ లుక్
Advertisement
Ads by CJ

మన శంకర వర ప్రసాద్ గారు నుంచి దర్శకుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ బర్త్ డే కి అద్దిరిపోయే టీజర్ ఇచ్చారు. మెగా అభిమానులు మన శంకర వర ప్రసాద్ గారు లో మెగా స్టార్ లుక్స్ కి, ఆయన వింటేజ్ స్టయిల్ కి  ఫిదా అయ్యారు. ఈ చిత్రంలో చిరు సరసన మరోమారు నయనతార జతకడుతుంది. గతంలో సైరా లో చిరు భార్యగా నయనతార నటించింది. 

తర్వాత గాడ్ ఫాదర్ లో నయన్ చిరు కి చెల్లిగా నటించింది. ఇప్పడు చిరు కి భార్యగా శంకర్ వరప్రసాద్ లో కనిపించబోతుంది. ఆమె ఈ చిత్రలోకి వచ్చేటప్పుడే చాలా హడావిడి చేస్తూ వచ్చింది. ఇక ఈ చిత్రంలో నయనతార లుక్ పై చాలామంది చాలా క్యూరియాసిటీ కనిపించింది. ఈ దసరా నుంచి మన శంకర వర ప్రసాద్ గారు అప్ డేట్స్ జాతర అని అనౌన్స్ చేసిన ఒక్కరోజులోనే నయనతార లుక్ వదిలారు మేకర్స్. 

ఎల్లో శారీ లో గొడుకు పట్టుకుని నయనతార ఎంత బ్యూటిఫుల్ గా ఉందొ అనేది మాటల్లో వర్ణించడం కూడా కష్టమే. శశిరేఖ పాత్రలో నయనతార చాలా ట్రెడిషనల్ గా అందంగా కాదు కాదు ఆకర్షణగా కనిపించి మన శంకర్ వరప్రసాద్ గారికి పర్ఫెక్ట్ జోడి అనిపించింది. 

Nayanthara As Sasirekha In MSG:

Chiranjeevi Mana Shankara Vara Prasad Garu Unveils Nayanthara First Look

Tags:   NAYANTHARA
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ