ఛ బిగ్ బాస్ కి వెళ్లి తప్పు చేశా అంటూ బిగ్ బాస్ కి వెళ్లొచ్చిన 90 పర్సెంట్ కంటెస్టెంట్స్ మాట్లాడే మాట. బిగ్ బాస్ లో మాకు మెములానే ఉంటామని చెప్పి బిగ్ బాస్ ఆడించే గేమ్ లో తమ విలువలను వదిలేసుకునేది కొందరు, లవ్ ట్రాక్స్ అంటూ జీవితాల్లో సఫర్ అయిన వాళ్ళు కొందరు. బిగ్ బాస్ టాస్క్ లో కొట్టుకుని తన వ్యక్తిత్వాన్ని దిగ్గజుకునేది కొందరు, బిగ్ బాస్ కి వెళ్లి ట్రోల్ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్లొచ్చినవారు కొందరు. ఇలా చాలామంది బిగ్ బాస్ కి వెళ్లి సఫర్ అయినవాళ్లే.
తాజాగా ఆ లిస్ట్ లో షణ్ముఖ్ జస్వంత్ చేసాడు. బిగ్ బాస్ హౌస్ లో సిరి హన్మంత్ తో స్నేహానికి మించి ఫ్రెండ్ షిప్ చేసి బ్యాడ్ అవడమే కాదు, బిగ్ బాస్ వలన తను పేమించిన దీప్తి సునయనను కోల్పోయాడు. బిగ్ బాస్ వలన ట్రోల్ అయ్యి బాగా బ్యాడ్ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్లి ఆ తర్వాత ఓ డ్రగ్ కేసులో ఇరుక్కుని మీడియాలో హైలెట్ అయిన షణ్ముఖ్ జస్వంత్ ప్రస్తుతం నార్మల్ లైఫ్ అంటే సినిమాల్లో నటిస్తూ ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు.
ఆ ప్రమోషన్స్ లో షణ్ముఖ్ తను బిగ్ బాస్ హౌస్ వెళ్లి తప్పు చేసాను అంటూ వాపోయాడు. ఒక కేసులో ఇరుక్కుని ఎవరికీ మొహం చూపించలేకపోయాను, నా తల్లికి క్యాన్సర్, నా బాధను పంటిబిగువున నొక్కిపెట్టాను, నా ఫాదర్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ కోసం పరిగెడుతూ బిపి తో పడిపోయి ఆసుపత్రి పాలయ్యారు. మంచి కొడుకుని కాలేకపోయాను అంటూ ఓ షో లో చెప్పడం హైలెట్ అయ్యింది.
ఏది ఏమైనా బిగ్ బాస్ సీజన్ 9 జరుగుతున్న సమయంలో షణ్ముఖ్ అలా బిగ్ బాస్ షో గురించి చేసిన కామెంట్స్ మాత్రం హాట్ టాపిక్ గా మారాయి.