Advertisementt

పెళ్లిపీటలెక్కిన చిన్నారి పెళ్లి కూతురు

Tue 30th Sep 2025 09:01 PM
avika gor  పెళ్లిపీటలెక్కిన చిన్నారి పెళ్లి కూతురు
Avika Gor marries Milind Chandwani పెళ్లిపీటలెక్కిన చిన్నారి పెళ్లి కూతురు
Advertisement
Ads by CJ

చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్ ఏడడుగులు బంధంలోకి అడుగుపెట్టింది. ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన అవికా గోర్ ఆ తర్వాత వరస సినిమాలు చేసినా అంత గుర్తింపు రాలేదు. బిజినెస్ మ్యాన్ మిలింద్ చాంద్వాని తో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న అవికా గోర్ ఈ జూన్ లో ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి ప్రకటన చేసింది. 

గత నాలుగు రోజులుగా పెళ్లి సంబరాల్లో మునిగిపోయిన అవికా గోర్-మిలింద్ చాంద్వాని ల జంట నేడు సెప్టెంబర్ 30 న పెళ్లి పీటలెక్కారు. ముంబై లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిపోయింది. ముంబై వేదికగా జరిగినఅవికా గోర్ పెళ్ళికి సినీ పరిశ్రమ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 

ప్రస్తుతం అవికా - మిలింద్ చాంద్వానిపెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Avika Gor marries Milind Chandwani :

Avika Gor celebrated her marriage to Milind Chandwani in a grand ceremony

Tags:   AVIKA GOR
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ