పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వైరల్ ఫీవర్ తో సతమతమవుతున్నారు. ఆయన తీవ్ర జ్వరంతో మంగళగిరి నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ టెస్ట్ లు అవి చేయించుకుని ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. దానితో ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా పవన్ ను హైదరాబాద్ నివాసంలో పరామర్శించి వచ్చారు.
ఈమధ్యన ఏపీ అసెంబ్లీ లో బాలకృష్ణ చిరు ని జగన్ ని కామెంట్స్ చెయ్యడం, బాలయ్య సారీ చెప్పాలని మెగా ఫ్యాన్స్ రాద్ధాంతం, అటు చిరు పై బాలయ్య కామెంట్స్ విషయంలో జనసేన నుంచి పవన్ నుంచి వ్యతిరేఖత లేకపోవడంతో వైసీపీ వాళ్ళు రచ్చ చేస్తున్న సమయంలో తన అన్న చిరు తో కలిసి పవన్ కళ్యాణ్ OG ని వీక్షించడం హాట్ టాపిక్ అయ్యింది.
ఈరోజు సోమవారం సాయంత్రం అన్న చిరంజీవి తో కలిసి పవన్ కళ్యాణ్ తన రీసెంట్ హిట్ మూవీ OG ని చూసి ఎంజాయ్ చెయ్యబోతున్న విషయం మాత్రం మెగా ఫ్యాన్స్ ని ఎగ్జైట్ అయ్యేలా చేసింది.