పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకుడు మారుతితో మూవీ కమిట్ అయ్యారు అనగానే ప్రభాస్ ఫ్యాన్స్ మారుతి ఎంత దారుణంగా ట్రోల్ చేసారో, రాజా సాబ్ ఫస్ట్ లుక్ వదిలారు, ఆతర్వాత లుక్స్, టీజర్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళనను ఎగరగొట్టేశాయి. దానితో రాజా సాబ్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ అనుక్షణం ఎదురు చూసేలా చెయ్యడంలో మారుతి డబుల్ సక్సెస్ అయ్యాడు.
జనవరి 9 న విడుదల కాబోతున్న రాజా సాబ్ ట్రైలర్ ని మూడు నెలల ముందే వదులుతామని మేకర్స్ అనడంతో ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు. కానీ ఇన్ని నెలల ముందే రాజా సాబ్ ట్రైలర్ వదలడంపై ఎంతోమందిలో ఎన్నో అనుమానాలు.. తాజాగా దసరా స్పెషల్ గా ద రాజా సాబ్ ట్రైలర్ వచ్చేసింది.
రాజా సాబ్ ట్రైలర్ లో కళ్ళు మూసుకో, డీప్ గా గాలి తీసుకో నీ బ్రెయిన్ నా కమాండ్స్ మాత్రమే ఫాలో అవుతుంది అంటూ ప్రభాస్ ని హిప్నటైజ్ చేస్తూ ట్రైలర్ మొదలవుతుంది.. చంపేశాడు బాబో అంటూ ప్రభాస్ భయపడడం, హీరోయిన్స్ తో రొమాన్స్, తాత సంజయ్ దత్ ఆత్మతో ప్రభాస్ కామెడీ చెయ్యడం, ఏదో గుర్తుండిపోయే పని చెయ్యాలి, సంచలనమైపోవాలి.. ఏంట్రా ఇలా చేశాడంటూ అందరూ షాకైపోవాలి అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్స్, ప్రభాస్ ముసలి తో చేసే ఫైట్ అన్ని ట్రైలర్ లో హైలెట్ అయ్యాయి.
ప్రభాస్ చుట్ట తాగే లుక్, మిగతా సీన్స్ లోని ప్రభాస్ ఫిట్ గా కనిపించే స్టైలిష్ లుక్స్ మాత్రం అద్దిరిపోయాయి. మిర్చిలో చూసినట్టుగా ప్రభాస్ కనిపించడమే కాదు, చాలారోజుల తర్వాత ప్రభాస్ యాక్షన్ మోడ్ నుంచి కామెడీ వైపు రావడం ఫ్యాన్స్ కు సూపర్ ఫీస్ట్. హీరోయిన్స్ మాళవిక, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ గ్లామర్ గా కనిపించారు, మారుతి డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, థమన్ BGM అన్ని సూపర్బ్ గా ఉంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వాల్యూస్ ట్రైలర్ కి రిచ్ గా మ్యాచ్ అయ్యాయి.