పవన్ కళ్యాణ్-సుజిత్ కలయికలో తెరకెక్కిన దే కాల్ హిమ్ OG చిత్రం గత గురువారం విడుదలై హిట్ టాక్ తో థియేటర్స్ లో సందడి చేస్తుంది. పవన్ కళ్యాణ్ మాస్ లుక్స్, ఆయన యాక్షన్ కు పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. థమన్ ఇచ్చిన BGM కి ఫ్యాన్స్ కి పూనకలొచ్చేశాయి.
ఇక మొదటిరోజే OG కలెక్షన్స్ పరంగా రికార్డ్ క్రియేట్ చేసింది. రూ.154 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిన OG ఫస్ట్ వీకెండ్ లో ఎంత కలెక్ట్ చేసిందో అనేది మేకర్స్ అఫీషియల్ పోస్టర్ తో ప్రకటించారు. మొదటివారాంతంలో రూ.252 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసినట్లుగా మేకర్స్ అధికారికరంగా ప్రకటించారు.
మరి ఫస్ట్ వీకెండ్ లో OG ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావడం పై పవన్ ఫ్యాన్స్ హ్యాపీ గా ఫీలవుతున్నారు. అంతేకాకుండా చాలా ఏరియాల్లో OG బ్రేక్ ఈవెన్ అయినా అవ్వొచ్చని పవన్ ఫ్యాన్స్ క్రేజీ గా ఫీలవుతున్నారు.