హరి హర వీరమల్లు అంటూ క్రిష్ ను, OG అంటూ సుజిత్ ని, ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ హరీష్ శంకర్ ను లైన్ లో పెట్టి ఏళ్లకు తరబడి వెయిట్ చేయిస్తే అందులో క్రిష్ వీరమల్లు చేసే సమయంలోనే కొండపొలం సినిమా చేసొచ్చాడు. ఆతర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి బయటికెళ్లి ఘాటీ చేసుకున్నారాయన.
కానీ దర్శకుడు సుజిత్ ఎటు పోకుండా, తన కాన్సంట్రేషన్ డైవర్ట్ అవ్వకుండా OG మీద కూర్చున్నాడు. మూడేళ్ళ బరువు ను సుజిత్ ఫైనల్ గా దించేసుకున్నాడు. OG మీద నమ్మకం పెట్టి మరీ కొట్టాడు. ఇక మరో దర్శకుడు హరీష్ శంకర్ వంతు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ని మొదలుపెట్టారు.
హరీష్ శంకర్ ని కూడా పవన్ కళ్యాణ్ సినిమా సెట్ పై పెట్టి ఎన్నో ఏళ్ళు వెయిట్ చేయించగా హరీష్ శంకర్ సైలెంట్ గా రవితేజ తో మిస్టర్ బచ్చన్ చేసేసుకున్నాడు. ఆ సినిమా ఫలితమెలా ఉన్నా.. హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వదిలిన కంటెంట్ ఫ్యాన్స్ ను బాగానే ఇంప్రెస్స్ చేసాయి.
ఇప్పుడు హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ని ఆడియన్స్ మెచ్చేలా అవుట్ ఫుట్ ప్రిపేర్ చెయ్యాలి. OG హిట్ ని హరీష్ శంకర్ కంటిన్యూ చెయ్యాలి. అంటే ఇప్పుడు సుజిత్ బరువు దించేసుకుంటే ఇకపై హరీష్ వంతు, అంటే ఆ బరువు ను హరీష్ శంకర్ మొయ్యాలి అన్నమాట.