బిగ్ బాస్ సీజన్ 9 ఎంత చప్పగా ఉందొ ఈ సీజన్ బిగ్ బాస్ బజ్ అంతకంటే ఎక్కువ నీరసంగా ఉంది. ఈ సీజన్ బజ్ కి గతంలో గీతూ రాయల్, అంబటి రాయుడు లా బిగ్ బాస్ బజ్ లో ఫైర్ ఉంటుంది, శివాజీ అడిగే ప్రశ్నలకు తెల్ల మొహం వెయ్యాల్సిందే అనుకున్నారు. కానీ గత రెండు వారాలుగా ఎలిమినేట్ అయిన శ్రష్టి కానీ, మనీష్ ఎపిసోడ్స్ లో ఎలాంటి కిక్ లేదు.
దానితో బిగ్ బాస్ బజ్ చూసి అందరికి నీరసమొచ్చింది. కానీ మూడో వారం బిగ్ బాస్ బజ్ చూస్తే.. శివాజీ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ ప్రియా శెట్టి ని అల్లాడించిన తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. శివాజీ ఫైర్ చూసి ఇది కదా బజ్ లో కావాల్సింది అంటూ మాట్లాడుకుంటున్నారు. ప్రియా శెట్టి అయితే శివాజీ అడిగిన ప్రశ్నలకు తెల్లమొహం వేసి బిక్క సచ్చిపోయింది. నాగార్జున ముందు కాలు మీద కాలు వేసుకోవడం దగ్గరనుంచి హౌస్ లో నోరేసుకుని పడిపోయిన వరకు హోస్ట్ శివాజీ ప్రియను గుచ్చి గుచ్చి ప్రశ్నించారు.
బుల్లితెర ప్రేక్షకులు ప్రియా శెట్టి ని హౌస్ లో ఎంతగా భరించలేకపోయారో వారు సోషల్ మీడియాలో పెట్టిన కామెంట్లు చూసి ప్రియా తేరుకోలేకపోయింది. తనకు తప్పు చేసానని తెలుసు, కన్ఫ్యూజ్ అయ్యాను, తప్పు తెలుసుకునేలోపు ఇక్కడున్నా అంటూ పదే పదే చెప్పింది.
మూడో వారం కామ్ గా ఉన్నా, నామినేషన్స్ లోను అరవలేదు అయినా నేను ఎలిమినేట్ అయ్యాను, కానీ శ్రీజ తప్పు తెలుసుకోలేదు అనగానే నెక్స్ట్ వీక్ ఆమె కూడా ఎలిమినేట్ అవుతుందిలే అంటూ శివాజీ వెటకారమాడాడు. ఈ వారం బజ్ మాత్రం అద్దిరిపోయింది అంటూ నెటిజెన్స్ శివాజీని పొగుడుతన్నారు.