అదే నిజమైన ప్రేమ-సమంత

Mon 29th Sep 2025 12:08 PM
samantha  అదే నిజమైన ప్రేమ-సమంత
Samantha shared a poem on finding love అదే నిజమైన ప్రేమ-సమంత
Advertisement
Ads by CJ

సమంత హీరో సిద్దార్థ్ తో ప్రేమాయణం తర్వాత అది బ్రేకప్ చేసుకుని కొన్నాళ్లు సింగిల్ గా ఉండి తర్వాత హీరో నాగ చైతన్య ను ప్రేమించి వివాహం చేసుకుని నాలుగేళ్లకు విడాకులు తీసుకుని విడిపోయింది. ఆతర్వాత కొన్నాళ్ళు సింగిల్ లైఫ్ ని లీడ్ చేసి ప్రస్తుతం రాజ్ నిడమోరు తో డేటింగ్ చేస్తుంది అనే ప్రచారం తెరపైకి వచ్చింది. 

ఇక నటనకు బ్రేకిచ్చి సోషల్ మీడియాలో యాక్టీవ్ అయిన సమంత లైఫ్ లెసెన్స్ మాట్లాడుతుంది. తాజాగా ఆమె నిజమైన ప్రేమ అంటూ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. నేను నా మేకప్ ఆర్టిస్ట్ లైఫ్ గురించి డిస్కస్ చేసాము, ముప్పై ఏళ్ల తర్వాత మీరు ప్రపంచాన్ని చూసే తీరు మారుతుంది. ముప్పయ్యేళ్ల తర్వాత అందం తగ్గుతుంది, మీ మెరుపు అన్నిట్లో మార్పు వస్తుంది. లైఫ్ ని ఎంజాయ్ చెయ్యాలంటే 20 ఏళ్ళే కరెక్ట్.  లేదంటే మీకు ఏది చెయ్యాలన్నా సమయం మించిపోయినట్లు అనిపిస్తుంటుంది

నేను నా 20 ఏళ్ళ వయసులో రెస్ట్ లేకుండా పని చేస్తూ ప్లానింగ్ లేకుండా గందరగోళంగా గడిపాను. క్రేజ్ కోసం ఆరాటపడ్డాను. ఆ సమయంలో నన్ను నేను ఎంత కోల్పోయానో ఎవరికీ తెలియదు. అప్పుడు ప్రేమ గురించి  నాకెవరూ చెప్పలేదు. నిజమైన ప్రేమ మనలోనే ఉంటుందని, మనల్ని మనం ప్రేమించుకోవడమే నిజమైన ప్రేమ అని తర్వాత అర్థం చేసుకున్నా అంటూ సమంత చేసిన ప్రేమ కామెంట్లు చూసి ఇదంతా నాగ చైతన్య గురించే ఆమె మాట్లాడింది అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. 

Samantha shared a poem on finding love:

 Samantha Ruth Prabhu shared a poem on finding love

Tags:   SAMANTHA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ