గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ ఆరంభించి 18 ఏళ్ళు పూర్తవడంతో ఆయన నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పెద్ది నుంచి పవర్ ఫుల్ పోస్టర్ వదులుతూ మేకర్స్ విషెస్ తెలియజెయ్యగా.. మెగాస్టార్ చిరు సోషల్ మీడియా వేదికగా కొడుకు చరణ్ కు శుభాకాంక్షలు తెలియజేసారు.
చరణ్ బాబు,
18 ఏళ్ల క్రితం చిరుతతో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను.
నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం.. నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను ఇండస్ట్రీలో మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి.
తండ్రిగా నేను నిన్ను చూసి ఎప్పుడు గర్వపడుతుంటా.. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో, దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలు నువ్వు అధిరోహించాలి అని కోరుకుంటూ..
విజయోస్తు…! @AlwaysRamCharan అంటూ ట్వీట్ చేసారు.