గత కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి నుంచి కొన్ని ప్రత్యేక టెస్ట్ ల కోసం వైద్యుల సూచనలు మేరకు హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోని ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు, ఆ విషయం తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకొని నేరుగా మిత్రుడు పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి పవన్ ని పరామర్శించారు.
పవన్ కళ్యాణ్ నివాసంలో ఆయనను పరామర్శించి, త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలని తెలియజేసిన చంద్రబాబు. అందుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.