Advertisementt

సూపర్బ్ అప్ డేట్ తో రాజా సాబ్

Sun 28th Sep 2025 10:36 AM
the raja saab  సూపర్బ్ అప్ డేట్ తో రాజా సాబ్
The Raja Saab Trailer Release Date సూపర్బ్ అప్ డేట్ తో రాజా సాబ్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ చిత్రం పదే పదే వాయిదాలు పడడము, మారుతి డైరెక్టర్ గా సినిమా తెరకెక్కడంతో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అవుతూ కనిపించారు. కానీ మారుతి రాజా సాబ్ టీజర్ తో అభిమానుల ఆందోళలను 100 పెర్సెంట్ తగ్గించేసాడు. దానితో సినిమా విడుదలపై ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. 

ఈ దసరా కు రాజా సాబ్ నుంచి ట్రైలర్ వదులుతారు, కాంతార చాప్టర్ 1 థియేటర్స్ లో రాజా సాబ్ ట్రైలర్ ను ఎటాచ్ చెయ్యబోతున్నారనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ రాజా సాబ్ మేకర్స్ స్పెషల్ పోస్టర్ తో రాజా సాబ్ ట్రైలర్ విడుదల తేదీ, టైమ్ లాక్ చేసి సూపర్బ్ అప్ డేట్ అందించారు.

సెప్టెంబర్ 29 సాయంత్రం 6 గంటలకు అంటే రేపు సోమవారం సాయంత్రమే రాజా సాబ్ ట్రైలర్ ని వదులుతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. దసరా కు రెండు రోజుల ముందే అదిరిపోయే ట్రీట్ ను మేకర్స్ అభిమానుల కోసం సిద్ధం చేస్తున్నారు. మరి జనవరి 9 న విడుదల కాబోతున్న రాజా సాబ్ నుంచి మరో ట్రైలర్ డిసెంబర్ లో యుఎస్ వేదికగా రిలీజ్ చేస్తారని టాక్. 

The Raja Saab Trailer Release Date:

Trailer Of The Raja Saab Will Be Out On September 29

Tags:   THE RAJA SAAB
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ