గురువారం దసరా స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG చిత్రానికి క్రిటిక్స్ మిక్స్డ్ రివ్యూస్ ఇచ్చినా, ఆడియన్స్ నుంచి హిట్ టాక్ పడడం, అభిమానుల అండతో OG మొదటి రోజు రూ. 154 కోట్ల గ్రాస్ ని రాబట్టి ఓపెనింగ్స్ పరంగా రికార్డ్ క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ OG లుక్ కి, ఆయన స్టయిల్ కి ఫ్యాన్స్ కి పూనకలొచ్చేశాయి.
థమన్ BGM, సుజిత్ ఎలివేషన్ సీన్స్ కి పడిపోని అభిమాని లేరు. మొదటిరోజు అదరగొట్టిన కలెక్షన్స్ రెండో రోజుకి డ్రాప్ అయ్యాయి, మూడో రోజు బుక్ మై షో ఓపెన్ చేస్తే OG కి కావాల్సినన్ని టికెట్లు దొరికేలా ఉన్నాయి. సండే OG టికెట్స్ ఫ్రీగా దొరికేస్తున్నాయి. కారణం వర్షాలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు అల్లడిస్తున్నాడు.
హైదరాబాద్ అయితే కోలుకోకుండా మూసి నది ఉగ్రరూపం దాల్చేసింది. సగం సిటీ మునిగిపోయింది. మరోపక్క ఏపీలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. అభిమానులు తప్ప కామన్ ఆడియన్స్ ఎవరూ సినిమాకి వెళ్లి థియేటర్స్ లో OG ని చూస్తూ ఎంజాయ్ చేసే మూడ్ లో లేరు. సో వర్షాలు OG కలెక్షన్ కి అడ్డుకట్ట వేసాయి. మరి OG రికార్డులు కొల్లగొడుతుంది అని ఎదురు చూసిన ఫ్యాన్స్ ఆశ అడియాసే మిగిలేలా ఉంది.