బెబో కరీనా కపూర్ ప్రతిభ గురించి తెలిసిందే. రెండున్నర దశాబ్ధాలుగా బాలీవుడ్ అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన కరీనా కొన్నేళ్ల క్రితం సైఫ్ ఖాన్ ని పెళ్లాడి, ఇద్దరు కిడ్స్ కి మమ్మీగా మారింది. పిల్లలు పుట్టాక చాలా వరకూ తన సమయాన్ని ఇంటికే కేటాయిస్తోంది. అడపా దడపా సినిమాలు చేస్తున్నా కానీ పూర్తిగా ఇండస్ట్రీకి అంకితమవ్వడం కుదరడం లేదు.
సరిగ్గా ఇలాంటి సమయంలో ఎంట్రీ ఇస్తోంది జూనియర్ కరీనా. ఈ బ్యూటీ అందచందాలకు మతులు చెడిపోతున్నాయ్. ఈ బ్యూటీ ఎవరో కాదు.. ఇండస్ట్రీకి సుపరిచితుడైన ప్రముఖ నటుడు రజత్ భేడి కుమార్తె వెరా భేడీ. ఈ అందాల భామ గాజు కళ్లతో అచ్చం కరీనాను తలపిస్తోంది. ఆ ముఖం బౌండరీ, కళ్లు, ముక్కు తీరు, స్మైల్ ప్రతిదీ అచ్చు గుద్దినట్టు కరీనానే పోలి కనిపిస్తుంటే అభిమానులు ఫిదా అయిపోతున్నారు. అయితే `బెబో 2`గా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే, తనపై తీవ్ర ఒత్తిడి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వెరా ప్రస్తుతం నటనలోకి రావాలని ఆలోచిస్తోంది. కానీ ఇంకా అధికారికం కాదు.
ఇంకా స్టడీస్ ని పూర్తి చేసి, పూర్తిగా నటనలో శిక్షణ తీసుకుని అప్పుడు బరిలో దిగేందుకు ఛాన్సుందని రజత్ భేడి తాజా ఇంటర్వ్యూలో ధృవీకరించారు. వెరా భేడి కళ్లు, ముక్కు తీరు, ముఖాకృతి చూశాక `బెబో`ని తలపిస్తోందా లేదా? అన్నది మీరే చెప్పండి.