బిగ్ బాస్ సీజన్ 9 చప్పగా స్టార్ట్ అయ్యింది. ఓపెనింగ్ ఎపిసోడ్ కూడా డల్ గా ఉండడమే కాదు.. హౌస్ లోకి ఎలాంటి క్రేజు లేని కంటెస్టెంట్స్ ఎంటర్ అవడం ఓ ఎత్తు, కామనర్స్ అంటూ హౌస్ ని రచ్చ చేస్తోన్న కంటెస్టెంట్స్ మరో ఎత్తు ఇలా ఈ సీజన్ ను చప్పగా తేల్చేస్తున్నారు. ఇక మూడు వారాల షో లో ఇప్పటికే శ్రష్టి, మనీష్ లు ఎలిమినేట్ అయ్యారు.
ఇక ఈ వారం వీకెండ్ ఎపిసోడ్స్ లో నాగార్జున హౌస్ మేట్స్ కి స్మూత్ గా క్లాస్ పీకి, సంజన మిడ్ వీక్ ఎలిమినేషన్స్ డ్రామా నడిపి, ఆమెను హౌస్ లోకి తీసుకోవాలంటే హౌస్ మేట్స్ శాక్రిఫైజ్ చెయ్యాలంటూ కండిషన్ పెట్టి అలా అలా సంజనను హౌస్ లోకి తిరిగి తీసుకొచ్చారు. అంటే సంజన మిడ్ వీక్ ఎలిమినేషన్ అంతా ఫేక్ అన్నమాట.
ఈ వారం నామినేషన్స్ లో ఉన్నవారిలో పవన్ కళ్యాణ్, ప్రియ, హరీష్, రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, రాము రాథోడ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంలో కాస్త సస్పెన్స్ నడిచింది. అయితే ఈవారం కామనర్స్ లో ప్రియా అవుట్ అయినట్లుగా తెలుస్తుంది. ప్రియా శ్రీజ తో కలిసి తూతూ అంటూ పాట పాడడమే కాదు ఆమె ఈ వారం డల్ గా కనిపించడంతో ఆమెను బుల్లితెర ప్రేక్షకులు ఈ వారం నిర్ధాక్షిణ్యంగా ఎలిమినేట్ చేసేసారు.