Advertisementt

దేవర 2 పై క్రేజీ అప్ డేట్

Sat 27th Sep 2025 05:35 PM
devara 2  దేవర 2 పై క్రేజీ అప్ డేట్
All set for Devara 2 దేవర 2 పై క్రేజీ అప్ డేట్
Advertisement
Ads by CJ

దేవర చిత్రం విడుదలై ఈరోజుకి ఏడాది కావటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా దేవర ముచ్చటకు తెర లేపారు. దేవర చిత్రం పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు, ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ ను చూడాలనుకున్నారు. కానీ దేవర చిత్రం ప్రమోషన్స్ క్యాన్సిల్ కావడమే కాదు, దేవర చిత్రం అభిమానులను ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది. 

కానీ అభిమానులు ఎన్టీఆర్ ని తక్కువ కాకుండా చూడాలని దేవర ని తమ భూజాల మీద మోసారు. పోయింది అనుకున్న దేవర చిత్రానికి 500 కోట్ల కలెక్షన్స్ తీసుకొచ్చింది కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్స్. దేవర చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ చూసి దానికి సీక్వెల్ ఉండదని ఎంతమంది ఫిక్స్ అయినా ఎన్టీఆర్ మాత్రం దేవర సీక్వెల్ పై కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. 

దేవర రిలీజ్ అయ్యి ఏడాది అయిన సందర్భంగా నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ ఒక పోస్టర్ తో పాటు దేవర 2 త్వరలోనే ప్రారంభమవుతుందని హింట్ ఇవ్వడంతో  ఫ్యాన్స్ యాక్టివ్ అయిపోయారు. మరి దేవర 2 ఉంటుంది అంటున్నా ఎన్టీఆర్ ఒప్పుకున్న మిగతా ప్రాజెక్ట్స్ పూర్తయ్యి దేవర 2 పైకి వచ్చేసరికి ఎన్నేళ్లు పడుతుందో అనేది చూడాలి. 

కొరటాల మాత్రం దేవర వచ్చి ఏడాదినా ఇప్పటివరకు ఆయన వేరే ప్రాజెక్ట్ పై కి వెళ్లకుండా దేవర సీక్వెల్ ప్లానింగ్ లోనే ఉన్నారనే టాక్ అయితే వినబడుతుంది. 

All set for Devara 2:

Exciting update on Devara 2

Tags:   DEVARA 2
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ