నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవికి సారీ చెప్పాలి ఇది మెగా ఫ్యాన్స్ డిమాండ్. అంతేకాదు జగన్ మోహన్ రెడ్డిని సైకో అని సంబోధించిన బాలయ్య వెంటనే జగన్ కి సారీ చెప్పాలి లేకపోతే బాలయ్యకు దబిడి దిబిడే అంటూ వైసీపీ నేతలు, మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా బాలయ్యకు వార్నింగ్ లు ఇస్తున్నారు.
జగన్ కు సారీ చెప్పకపోతే అఖండ 2 ని ఆడనివ్వమంటున్నారు. బాలయ్య సారీ చెప్పరు ఏం చేస్తారో చేసుకోండి అంటూ బాలయ్య అభిమానుల మాట. మరి బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల ఫలితంగా జగన్ మోహన్ రెడ్డి కి అవమానం జరిగింది, బాలకృష్ణ సారీ చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.
బాలయ్య సారీ చెప్పకపోతే అఖండ 2ని ఆడనివ్వమంటున్నారు, మరి వైసీపీ నేతలు, కార్యకర్తలు అఖండ 2 ని బాయ్ కాట్ చేస్తే.. ఆ చిత్రానికి లాస్ వస్తుందా, ఒకవేళ వీళ్లంతా బాలయ్యను ఇలా బెదిరిస్తే అఖండ 2 కి డ్యామేజ్ అవుతుందా చూద్దాం.. అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.