మంచు మోహన్ బాబు కెరీర్ ఆరంభంలో విలన్ గా ఎన్నో పాత్రలు, ఎందరో హీరోలకు అపోజిట్ కేరెక్టర్స్ వేసి ఎంతగా ప్రేక్షాధారణ పొందారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మోహన్ బాబు విలనిజాన్ని చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. మెగాస్టార్ చిరు దగ్గర నుంచి అనేకమంది హీరోలకు విలన్ గా కనిపించిన ఆయన తర్వాత హీరోగా టర్న్ అయ్యి అద్దరగొట్టేసారు .
ఇప్పుడు కూడా మోహన్ బాబు యాక్టీవ్ గా సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ గా కన్నప్ప లో కనిపించిన ఆయన హీరో నాని ప్యారడైజ్ చిత్రంలో విలన్ గా కనిపించబోతున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న ద ప్యారడైజ్ చిత్రంలో మోహన్ బాబు లుక్ రివీల్ చేసారు మేకర్స్.
ప్యారడైజ్ నుంచి వచ్చిన మోహన్ బాబు పోస్టర్ చూస్తే వింటేజ్ మోహన్ బాబు కనిపిస్తారు. ఆ మాస్ లుక్, అలాగే షర్ట్ లెస్ ఫోజ్ లో చేతులకు రక్తంలో ఊరమాస్ గా కనిపించడంతో ఆయన అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. మరి నాని-మోహన్ బాబు నడుమ ఎలాంటి యాక్షన్ ని శ్రీకాంత్ ఓదెల డిజైన్ చేసాడో చూడాలి.