అక్కినేని నాగార్జున ఇంట కొద్దినెలల గ్యాప్ లో ఇద్దరు మహాలక్ష్మిలు అడుగుపెట్టారు. డిసెంబర్ లో నాగ చైతన్య ను ప్రేమ వివాహం చేసుకున్న శోభిత దూళిపాళ్ల అక్కినేని నాగార్జున ఇంట పెద్ద కోడలిగా అడుగుపెట్టింది. ఆతర్వాత అక్కినేని ఇంట్లో ఏ అకేషన్ కి అయినా శోభిత పద్దతిగా ఫ్యామిలీతో కలిసి సెలెబ్రేట్ చేసుకుంటుంది.
ఇక ఈ జూన్ లో అఖిల్ కూడా ఓ ఇంటివాడయ్యాడు. జూన్ లో తను ప్రేమించిన జైనాబ్ ని అఖిల్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. నాగార్జున ఇంట చిన్న కోడలిగా జైనాబ్ అక్కినేని ఫ్యామిలిలో అడుగుపెట్టింది. తాజాగా నాగార్జున శివ రీ-రిలీజ్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన కోడళ్ళు శోభిత, జైనాబ్ లపై చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్ మారాయి.
చైతు భార్య శోభిత మా కుంటుంలో అద్భుతంగా ఉంటుంది. అందిరితో చక్కగా కలిసిపోతుంది. మా ఇంట్లో ఒక కూతురు ఉన్నట్టే ఉంది. మాకిప్పుడు ఇద్దరు కూతుళ్లు. జైనాబ్, శోభిత అంటూ కోడళ్లను నాగార్జున కూతుళ్లుగా సంబోధిస్తూ మాట్లాడడం హైలెట్ అయ్యింది. శోభిత తో అనుబంధం గురించి మాట్లాడుతూ.. మేమిద్దరం బుక్స్, సంగీతం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం.
ప్రస్తుతం శోభిత చైతూ ఇంట్లో ఒక గార్డెన్ పెంచాలని అనుకుంటోంది. నాకు కూడా గార్డెనింగ్ అంటే చాలా ఆసక్తి ఉంది, అందుకే దాని గురించి చాలా మాట్లాడుకుంటాం. మాది చాలా చక్కటి అనుబంధం అంటూ నాగార్జున శోభితతో తన అనుబంధం గురించి మట్లాడారు.