BB 9: కంటెస్టెంట్స్ పై నాగ్ ఫైర్

Sat 27th Sep 2025 11:50 AM
nagarjuna  BB 9: కంటెస్టెంట్స్ పై నాగ్ ఫైర్
BB 9: Nagarjuna Fire on Contestants BB 9: కంటెస్టెంట్స్ పై నాగ్ ఫైర్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 9 లో మూడో వారం వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. కింగ్ నాగార్జున స్టైలిష్ గా ఎంట్రీ ఇవ్వడమే కాదు కంటెస్టెంట్స్ పై ఫైర్ అయిన ప్రోమో ని వదిలారు. ఈరోజు ఎపిసోడ్ లో నాలుగురైదుగురు కంటెస్టెంట్స్ కు నాగార్జున చేతిలో క్లాస్ ఉందినిపిస్తుంది. అసలు హౌస్ లో టెనెంట్స్, ఓనర్స్ అంటూ పెట్టారు, కానీ హౌస్ లో అదెక్కడా కనిపించలేదు అంటూ నిన్నటివరకు కెప్టెన్ గా చేసిన పవన్ ని అడిగారు నాగ్. 

సంచాలక్ గా ఏం చేసావు, బజర్ నొక్కి సౌండ్ రావాలి కదా అని శ్రీజ కి క్లాస్ పీకిన నాగార్జున హరిత హరీష్ ని లత్కోర్ హరీష్ అంటూ ఫైర్ అయ్యారు. నేను ఎవరిని ఉద్దేశించి అనలేదు, మీరు చేసే పనులు లత్కోర్ పనులు అన్నాను అంటూ హారిష్ అన్నాడు, కానీ మిమ్మల్ని లత్కోర్ హరీష్ అంటే ఊరుకుంటారా.. నిన్ను అంటేనే మీరు అనమన్న మీరేనా ఇలా మాట్లాడింది అంటూ హరీష్ కి నాగ్ క్లాస్ తీసుకున్నారు. 

ఇక రీతూ చౌదరిని నాకు లక్కు లేదు అని ఏడుస్తున్నావ్ అంటూ ఆమెకి క్లాస్ తీసుకున్న ప్రోమో హైలెట్ అయ్యింది. మరి ఇంకెంతమందికి నాగార్జున చేతిలో క్లాస్ ఉండబోతుంది అనేది నైట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తే సరి. 

BB 9: Nagarjuna Fire on Contestants:

Bigg Boss Telugu 9: Nagarjuna fires on Haritha Harish

Tags:   NAGARJUNA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ