థియేటర్స్ లో అనుకోకుండా సెన్సేషనల్ హిట్ గా నిలిచిన చిన్న చిత్రం లిటిల్ హార్ట్స్ ఇంకా ఇంకా కలెక్షన్స్ తెస్తూనే ఉంది. ఈటివి విన్ కోసం నిర్మించిన ఈ చిత్రాన్ని బన్నీ వాస్, వంశీ నందిపాటి లు థియేటర్స్ లో విడుదల చెయ్యగా.. మౌళి పెరఫార్మెన్స్, కామెడీ అన్ని లిటిల్ హార్ట్స్ ని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా చేసింది.
లిటిల్ హార్ట్స్ ప్రీ రిలీజ్ ప్రమోషన్స్, పోస్ట్ ప్రమోషన్స్, అలాగే సెలబ్రిటీస్ స్పెషల్ ట్వీట్స్ అన్ని ఈ చిన్న చిత్రాన్ని పెద్ద హిట్ చేసాయి. అయితే థియేటర్స్ లో సెప్టెంబర్ 5 న విడుదలైన ఈ చిత్రం త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్ అంటూ వచ్చిన వార్తలను ఈటివి విన్ వారు కొట్టిపారేశారు.
తాజాగా ఈటివి విన్ నుంచి లిటిల్ హార్ట్స్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. అంతేకాకుండా లిటిల్ హార్ట్స్ ఓటీటీ వెర్షన్ లో మరిన్ని సర్ ప్రైజ్ లను యాడ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అక్టోబరు 1 నుంచి లిటిల్ హార్ట్స్ స్ట్రీమింగ్ కానుంది. అలాగే ఎక్స్టెండెడ్ కట్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.