నిన్న గురువారం ఏపీ అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ, కామినేని కి కౌంటర్ ఇచ్చే క్రమంలో మెగాస్టార్ చిరు పేరుని తీసి మాజీ ముఖ్యమంత్రి జగన్ ని సైకో అంటూ కామెంట్లు చేయడంపై వైసీపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో స్టయిల్ లో స్పందిస్తున్నారు. బాలయ్య వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరు వెంటనే ప్రెస్ నోట్ తో రియాక్ట్ అయ్యారు.
దానితో వైసీపీ నేతలు మరింతగా రెచ్చిపోయారు. మరోపక్క కందుల దుర్గేష్ కానీ, మిగతా జనసేన నేతలు కానీ, కార్యకర్తలు కానీ బాలకృష్ణ కామెంట్స్ విషయంలో మౌనం వహిస్తున్నారు. ఎటు మట్లాడినా వారికే నష్టం కాబట్టి వారు మౌనంగా ఉండాలని అధిష్టానం ఆదేశించిన రీతిలో వారి ప్రవర్తన కనిపిస్తుంది. కానీ వైసీపీ నేతలు జనసేన మౌనాన్ని భరించలేకపోతున్నారు.
కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నెంబర్ 1, పవన్ నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నారు. వారిని ఎలాగైనా విడగొట్టాలని వైసీపీ ఎదురు చూస్తుంది. ఇప్పడు చిరు vs బాలయ్య ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ ఎవరి వైపు స్పందించినా డ్యామేజ్ జరిగేది జనసేనకు. ఎలాగూ పవన్ వైరల్ ఫీవర్ తో సతమతమవుతూ కామ్ గా ఉన్నారు, ఆయనతో పాటే జనసేన మంత్రులు, నేతలు సైలెంట్ అయ్యారు.
అదే వైసీపీ ని నిలువనియ్యడం లేదు. చిరు విషయంలో జనసేన vs టీడీపీ కొట్టుకోవాలనేది వారి ప్లాన్. తీరా జనసేన సైలెంట్ అవడంతో వైసీపీ తట్టుకోలేకపోతుంది. ఇంతరెచ్చగొట్టినా జనసేన నుంచి ఎవరూ రియాక్ట్ అవ్వకపోవడం వైసీపీ ని ఇరుకునపెట్టేసింది.