అసలు అతడు నటుడే కాదు! అంటూ సల్మాన్ ఖాన్ ని తీవ్రంగా విమర్శించాడు `దబాంగ్` దర్శకుడు అభినవ్ కశ్యప్. సల్మాన్ వర్సెస్ అభినవ్ వార్ గురించి తెలిసిందే. దబాంగ్ లాంటి హిట్టిచ్చాక తన కెరీర్ ఎదగక పోవడానికి కారణం సల్మాన్, అతడి సోదరులు అని అభినవ్ పబ్లిగ్గానే విమర్శించాడు. దబాంగ్ 2 కి పని చేయడం కుదరదని అన్నందుకు తనను ఇబ్బంది పెట్టారని అతడు పలుమార్లు వాపోయాడు. కేవలం తనపైనే కాదు తన సోదరుడు అనురాగ్ కశ్యప్ పైనా సల్మాన్ నియంత్రణపై అభినవ్ పబ్లిగ్గా విరుచుకుపడ్డాడు. కొన్నేళ్ల క్రితం సల్మాన్ సినిమా `తేరా నామ్`కి పని చేసిన అనురాగ్ కశ్యప్ ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసాడని, ప్రాజెక్టు వదిలి వెళ్లిపోయేలా చేసాడని అభినవ్ విమర్శించాడు.
సల్మాన్ చెంచాగిరి చేస్తాడని, పాదాలు నాకుతాడని మరోసారి తీవ్రంగా విమర్శించాడు అభినవ్. అనురాగ్ తెరకెక్కించిన నిశాంచి (దక్షిణాది) చిత్రం విజయం సాధించిన సందర్భంగా సల్మాన్ చిత్రబృందాన్ని ప్రశంసించాక అభినవ్ ఇలా ఎటాక్ ప్రారంభించాడు. ఇదంతా తనను సైలెంట్ చేసేందుకేనని అభినవ్ అన్నాడు. అయితే అభినవ్ వ్యాఖ్యలకు సల్మాన్ నేరుగా స్పందించకుండా, తన అనుచరులతో ఎటాక్ చేయిస్తున్నాడు. ఈ వార్ ఇలా ఉండగానే ఇప్పుడు సల్మాన్ ఖాన్ పై మరోసారి అభినవ్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు.
నిశాంచి విజయంపై అతడి ప్రశంస వెనక వేరే కారణం ఉందని అభినవ్ అన్నాడు. తనను సైలెంట్ చేసేందుకు అతడు ఇలా చేస్తున్నాడని అన్నాడు. `తేరే నామ్` చిత్రం నుంచి అనురాగ్ వైదొలిగాడు.. సల్మాన్ ఇబ్బందులకు గురి చేసాడు కాబట్టే అతడు సినిమా నుంచి తప్పుకున్నాడని అన్నాడు. అతడు మోకాళ్లపై ఉంటాడు.. పాదాలను నాకుతాడు.. చెంచాగిరి చేస్తాడు! అంటూ తీవ్ర పదజాలంతో సల్మాన్ పై మరోసారి అభినవ్ విరుచుకపడ్డాడు. అతడు సూటిగా తాను ఏం అనాలనుకుంటున్నాడో అది అనేస్తున్నాడు. సల్మాన్ అంత పెద్ద స్టార్ పై ఈ రేంజులో విరుచుకుపడుతున్నాడు అంటే అతడు అంతగా ఇబ్బంది పడ్డాడా? అంటూ ఆరాలు మొదలయ్యాయి.