ఈగురువారం ఏపీ అసెంబ్లీ లో కామినేని కామెంట్స్ పై రియాక్ట్ అవుతూ ఎమ్యెల్యే బాలకృష్ణ మెగాస్టార్ చిరు అలాగే జగన్ పై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపాయి. చిరంజీవి గట్టిగా మాట్లాడితే జగన్ పిలిచారని కామినేని, కాదు అక్కడ ఎవరూ గట్టిగా మాట్లాడలేదు, అందరిని జగన్ అవమానించాడంటూ బాలయ్య ఒకరికొకరు కౌంటర్లు వేసుకున్నారు. బాలయ్య చిరుని జగన్ అవమానించారంటూ చేసిన కామెంట్స్ పై చిరు వెంటనే రెస్పాండ్ అవుతూ.. తను విదేశాల్లో ఉన్నాను అంటూ ప్రెస్ నాట్ వదిలారు.
బాలయ్య చెప్పినట్టుగా జగన్ మమల్ని అవమానించలేదు. మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు, బాలయ్య ను పిలవడానికి ఫోన్ చేశా ఎత్తలేదు, జెమినీ కిరణ్ మూడుసార్లు ప్రయత్నం చేసినా బాలయ్య కలవలేదు, జగన్ మా విషయంలోల్ తప్పుగా వ్యవహరించలేదు అంటూ ఆ ప్రెస్ నోట్ లో మాట్లాడడం తో వైసీపీ బ్యాచ్ కి అస్త్రం దొరికింది.
మెగాస్టార్ ప్రెస్ నోట్ పంపించి మంచి పని చేసారు, థాంక్స్ అండి. బాలకృష్ణ తాగేసి వచ్చి అసెంబ్లీలో జగన్ పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు, అఖండ సమయంలో టికెట్ రేట్స్ హైక్ కోసం నాకు ఫోన్ చెయ్యలేదా అని పేర్ని నాని, బాలయ్య మ్యాన్షన్ హౌస్ కొట్టి అసెంబ్లీకి వచ్చాడంటూ అంబటి, మార్గాని భరత్ ఇలా అందరూ చిరు ప్రెస్ నోట్ తర్వాత స్పందిస్తున్నారు.
చిరు బాలయ్య మాటలకు అంత స్పీడు గా రియాక్టు అవ్వాల్సిన అవసరం లేదు, నేను విదేశాల్లో ఉన్నాను, నాకేమి తెలియదని గమ్మునుండిపోతే పోయేది, ఇప్పుడు చిరు నోట్ వల్ల పవన్ కళ్యాణ్ కి డ్యామేజ్ అయ్యింది, గతంలో పవన్ చాలాసార్లు సినిమా ఇండస్ట్రీని పిలిచి జగన్ అవమానించారని అన్నారు, కానీ ఇప్పుడు చిరు చేసిన పని వల్ల వైసీపీ కి చేతికి బ్రహ్మాస్త్రం దిరికింది అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.