మూడ్ వారం కెప్టెన్సీ టాస్క్ గెలిచి ఇమ్మాన్యువల్ బిగ్ బాస్ 9 కి మూడో కెప్టెన్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ లో గత రెండు వారాలుగా సెలబ్రిటీస్ నుంచి శ్రష్టి వర్మ ఎలిమినేటవ్వగా, రెండో వారంలో కామన్ మ్యాన్ మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటుంటే.. బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ హడావిడి చేసి ఒకరిని ఎలిమినేట్ చెయ్యడం హౌస్ లో కలకలం సృష్టించింది.
రెడ్ సీడ్ పొందినారు నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతారని బిగ్ బాస్ చెప్పగానే హౌస్‌మేట్స్ గుండెలు జారిపోయాయి. అందులో హరీష్, భరణి, కళ్యాణ్, పవన్, రాము లోపలికి వెళ్లి ఎవరిని బయటికి పంపాలా అనే చర్చలు మొదలుపెట్టారు. ఆ గ్రూప్ లో ఎక్కువగా సంజన కు ఓటేశారు.
అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమేంటో చెప్పండి.. అని బిగ్‌బాస్ అనగానే హరిత హారిష్ సంజన గారు అని చెప్పాడు. దానితో హౌస్ మేట్స్ అంతా స్టన్ అయిపోయారు. క్లియర్‌గా నన్ను కార్నర్ చేస్తున్నారు కానీ ఏదైతే అది మీ ఫైనల్ డెసిషన్ బిగ్‌బాస్.. అంటూ సంజన చెప్పగానే సంజన మీరు వెంటనే మెయిన్ గేట్ నుంచి బయటికి వెళ్లండి అంటూ బిగ్‌బాస్ చెప్పాడు.
దానితో సంజన బయటకు వెళ్ళిపోయింది. మరి నిజంగానే సంజనా ఎలిమినేట్ అయ్యిందా, లేదంటే సీక్రెట్ రూమ్ కి వెళ్లిందా అనేది ఈరోజు ఎపిసోడ్ లో చూద్దాం.