పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా ఏళ్ళ తర్వాత స్ట్రయిట్ కథతో సుజిత్ దర్శకత్వంలో చేసిన చిత్రం OG. రన్ రాజా రన్ , సాహో చిత్రాలతో పేరు పేరు తెచ్చుకున్న సుజిత్ త్రివిక్రం ని కలిసి ఆయన ద్వారా పవన్ కళ్యాణ్ కి OG కథ చెప్పి ఒప్పించి మూడేళ్ళుగా అదే ప్రాజెక్ట్ పై పని చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల వెంట పరుగులుపెడుతున్నా ఓపిగ్గా వెయిట్ చేసి మరీ సుజిత్ OG ని పూర్తి చేసి ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు..
ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మీసం తిప్పుతూ ఇదే OG రివ్యూ రాసుకోమంటూ కాన్ఫిడెన్స్ చూపించి మరీ కొట్టాడు. OG కి థమన్ BGM ప్రాణం పోసింది. కథ లేదు, కానీ హీరో ఎలివేషన్స్ తో ఆడియన్స్ ను మెప్పించిన సుజిత్ ని తెగ పొగిడేస్తున్నారు. నిర్మాత దానయ్య మూడేళ్ళ కష్టాన్ని OG తీర్చెయ్యడమే కాదు ఆయనకు టెన్షన్ రిలీఫ్ దొరికింది.
OG నిన్న థియేటర్స్ లో విడుదలై ఫ్యాన్స్ నుంచే కాదు మాస్ ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక OG బుకింగ్స్ ఓపెన్ అయినప్పటి నుంచే రికార్డ్ సేల్స్ కనిపించాయి. మొదటిరోజు OG ఓపెనింగ్ రికార్డ్స్ సృష్టించడం ఖాయమనే మాట వినబడింది. అనుకున్నట్టుగానే OG మొదటిరోజు ఊచకోత కోసింది.
ఏకంగా OG వరల్డ్ వైడ్ గా 154 కోట్ల గ్రాస్ సాధించినట్లుగా మేకర్స్ ప్రౌడ్ గా అఫీషియల్ ప్రకటన ఇచ్చారు. OG మొదటి రోజు 154 కోట్లు కొల్లగొట్టినట్లుగా ప్రకటించారు.