నిన్న గురువారం విడుదలైన పవన్ కళ్యాణ్ OG చిత్రానికి సూపర్ హిట్ టాక్ పడిపోయింది. పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ సీన్స్ తోనే దర్శకుడు సుజిత్ కిక్ ఇచ్చాడు, థమన్ తన BGM తో పవన్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించడమే కాదు OG హిట్ లో థమన్ పాత్రే కీలకంగా మారింది.
ఈ చిత్రంలో తమిళ నటులు అర్జున్ దాస్, హీరోయిన్ ప్రియాంక మోహన్, శ్రియ రెడ్డిలు నటించారు. అయితే OG చిత్రం చూసేందుకు ప్రత్యేకంగా హైదరాబాద్ కి ఓ తమిళ హీరో రావడం హాట్ టాపిక్ అయ్యింది. ఆయనే లవ్ టుడే, డ్రాగన్ ఫేమ్ ప్రదీప్ రంగనాధన్. ప్రదీప్ రంగనాధన్ సోషల్ మీడియా వేదికగా..
Nenu ippudu Hyderabad raavadaniki oke kaaranam #PowerStar #OG choodataaniki maathrame…ee mass experience ni telugu vaallatho chooddame kadha mass. నేను ఇప్పుడు హైదెరాబాద్ రావడానికి ఒకే కారణం. పవర్ స్టార్ OG చూడడానికి మాత్రమే.. ఈ మాస్ ఎక్స్పీరియన్స్ ని తెలుగు వాళ్లతో చూడ్డం కదా మాస్ అంటూ ప్రదీప్ రంగనాధన్ ట్వీట్ చేసారు.
ప్రదీప్ రంగనాధన్ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి బాలానగర్ లోని మైత్రి మూవీస్ వారి విమల్ థియేటర్ లో ప్రత్యేకంగా OG ని వీక్షించడం హాట్ టాపిక్ అయ్యింది.