Advertisementt

అప్పుడు నిధి కి ఇప్పుడు నేహా కి అన్యాయం

Fri 26th Sep 2025 01:26 PM
og  అప్పుడు నిధి కి ఇప్పుడు నేహా కి అన్యాయం
Fans await Neha Shetty special song in OG అప్పుడు నిధి కి ఇప్పుడు నేహా కి అన్యాయం
Advertisement
Ads by CJ

బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు హీరోయిన్స్ రెండు పెద్ద సినిమాల్లో నటించి మోసపోయారు. వారు నాట్యం చేసిన పాటలను నిడివి ప్రాబ్లెమ్ రావడంతో ఎడిటింగ్ లో లేపేశారు. ముందుగా ఈమధ్యనే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న తేజ సజ్జ మిరాయ్ చిత్రంలో నిధి అగర్వాల్ స్పెషల్ సాంగ్ చేసింది. ఆ సాంగ్ పై నిధి అగర్వాల్ చాలా హోప్స్ పెట్టుకుంది. 

కానీ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని నిడివి విషయంలో నిధి అగర్వాల్ సాంగ్ ని లేపేశారు, అదే కాదు తేజ సజ్జ -హీరోయిన్ రితిక ల డ్యూయెట్ సాంగ్ కూడా తీసెయ్యాల్సి వచ్చింది. ఇప్పడు మరో హీరోయిన్ నేహా శెట్టి విషయంలోనూ అదే జరిగింది. స్పెషల్ సాంగ్ లో నేహా శెట్టి అని OG మేకర్స్ అనౌన్స్ చెయ్యకపోయినా.. నేహా శెట్టి ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.  

కానీ OG ఫైనల్ ఎడిటింగ్ లో నేహా శెట్టి ఐటెం సాంగ్ ని లేపేశారు. అసలే హీరోయిన్ పాత్రలు కరువై.. మొదటిసారిగా స్పెషల్ సాంగ్ ని ఓకే చేసిన నేహా శెట్టి కి OG మేకర్స్ షాకిచ్చారు. పాపం అప్పుడు మిరాయ్ తో నిధి అగర్వాల్ కి, ఇప్పుడు OG తో నేహా శెట్టి ఇద్దరూ మోసపోయారన్నమాట. 

Fans await Neha Shetty special song in OG:

Will OG Later Add Neha Shetty Missing Song Like Mirai

Tags:   OG
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ