పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సుజిత్ కలయికలో తెరకెక్కిన OG నిన్న గురువారం విడుదలై సెన్సేషనల్ టాక్ తెచ్చుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ని హీరో చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు కనిపించడం కాదు.. OG కి రియల్ హీరో థమన్ అంటూ ఆడియన్స్ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు మూడేళ్ళుగా పవన్ కోసమే ఓపిగ్గా వేచి చూసి ఇంత మంచి అవుట్ ఫుట్ ఇచ్చిన సుజిత్ ని తెగ పొగుడుతన్నారు.
పవన్ కళ్యాణ్ ఇచ్చిన డేట్స్ ని వాడుకుంటూ లైన్ మిస్ అవ్వకుండా OG ని ఫ్యాన్స్ ని మెచ్చేలా సుజిత్ తెరకెక్కించాడు. ఇక ఈ చిత్రానికి గాను పవన్ కళ్యాణ్ రూ.80 కోట్ల పారితోషికం అందుకుంటే.. విలన్ ఇమ్రాన్ హష్మి రూ.5 కోట్లు, దర్శకుడు సుజీత్ రూ.8 కోట్లు, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కి రూ.5 కోట్లు, హీరోయిన్ ప్రియాంక మోహన్ రూ.కోటిన్నర, కీలక పాత్రలో నటించిన శ్రియా రెడ్డి రూ.50లక్షలు పారితోషికాలను నిర్మాత దానయ్య స్టార్స్ కి ఇచ్చినట్లుగా తెలుస్తుంది.
300 కోట్ల భారీ టార్గెట్ తో బరిలోకి OG చిత్రం ఈ రేంజ్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ తో ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో అని పవన్ ఫ్యాన్స్ అప్పుడే ఎగ్జైట్ అవుతూ.. మీటింగ్స్ పెట్టేసారు.