పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో నటించిన OG చిత్రం స్టార్ట్ అయినప్పటినుంచి ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నాడనే న్యూస్ చక్కర్లు కొడుతూనే ఉంది. OG లో అకీరా డెబ్యూ ఉండబోతుంది అనే వార్తలతో పవన్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నా ఎక్కడా అకీరా విషయాన్ని OG మేకర్స్ రివీల్ చెయ్యలేదు.
కానీ అకీరా నందన్ OG చిత్రంలో కనిపించడం కాదు వినిపించబోతున్నాడు. అంటే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అకీరా ను పిలిచి OG BGM లో వర్క్ చెయ్యమని అడిగినట్లుగా థమన్ OG ఇంటర్వూస్ లో రివీల్ చేసేసారు. అకీరా ఎప్పటినుంచో మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు.
ఇప్పుడు OG తో నిజంగానే అకీరా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. అది స్క్రీన్ పైన కనిపిస్తే ఏమి వినిపిస్తే ఏమి.. ఫైనల్ గా పవన్ ఫ్యాన్స్ ఎదురు చూసిన క్షణం రానే వచ్చిందన్నమాట.