మరికొన్ని గంటల్లో అభిమానుల కోసం వేస్తున్న OG స్పెషల్ ప్రీమియర్స్ షోస్ కి తెలంగాణలో, అలాగే ఏపీలో ఇంతవరకు టికెట్ పెట్టుకోవచ్చు అంటూ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు జీవో లు జారీ చేసాయి. ఏపీలో ఏకంగా 1000 రూపాయలు స్పెషల్ ప్రీమియర్ కి అనుమతి ఇచ్చింది. అది ఈరోజు నైట్ 10 గంటల ప్రీమియర్ షో కి.
ఇక తెలంగాణలోనూ ఈరోజు బుధవారం నైట్ 10 గంటల షోకి 800 రూపాయల టికెట్ ధరను నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇక్కడి ప్రభుత్వం. గత అర్ధరాత్రి నుంచి ప్రీమియర్ షోస్ వేసే థియేటర్స్ లో టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే OG కోసం బుక్ మై షో ఓపెన్ చేస్తే టికెట్స్ ఉన్నట్లుగా చూపిస్తుంది.
టికెట్ బుక్ చేస్తే అవ్వడం లేదు, ఈలోపు ప్రీమియర్ షో టికెట్స్ దందా మొదలయ్యింది. బుక్ మై షో లో టికెట్స్ బ్లాక్ చేసి వాటిని 1500, 2000 లకు అమ్ముకుంటున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఇలాంటి దందాలే సినిమాల పైరసీకి ప్రోత్సహిస్తున్నాయని అనే అనుమానాలు కాదు ఇదే అసలు నిజం అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.