నిన్న మంగళవారం మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇంట్లో కస్టమ్స్ సోదాలు కలకలం సృష్టించాయి. భూటాన్ నుంచి లగ్జరి కార్లు దిగుమతి చేసుకున్నారన్న ఆరోపణలతో దుల్కర్ ఇంట్లో ఆయన ఆఫీస్ ల్లోనే కాకూండా పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంట్లోనూ కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఆపరేషన్ నమ్‌ఖోర్ పేరుతొ కార్ల పన్ను ఎగవేతకు పాల్పడుతున్న వారిపై కస్టమ్స్ అధికారులు దాడులు చేస్తున్న క్రమంలో దుల్కర్ సల్మాన్‌కు చెందిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ వాహనాన్ని అధికారులు సీజ్ చేశారు. తమిళనాడు రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉన్న ఈ కారును కొచ్చిలోని కస్టమ్స్ కార్యాలయానికి తరలించారు.
అంతేకాకుండా కొచ్చి సమీపంలోని మమ్ముట్టి పాత నివాసంలో పార్క్ చేసి ఉన్న ఎనిమిది లగ్జరీ కార్లను అధికారులు తనిఖీ చేశారు. ఈ దాడుల్లో భాగంగా మరో నటుడు అమిత్ చాకలక్కల్‌కు సంబంధించిన రెండు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.