పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన OG చిత్రం మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ తో సందడి చెయ్యడానికి రెడీ అయ్యింది. అసలే ప్రమోషన్స్ లేవు, మరోపక్క దర్శకుడు సుజిత్ సకాలంలో వర్క్ ఫినిష్ కాక అంతా హడావిడి, దానయ్య మొహం లో టెన్షన్, థమన్ సోషల్ మీడియా హడావిడి నడుమ OG రేపు 25 న విడుదలకు సిద్దమైంది.
ఆదివారం సాయంత్రం LB స్టేడియం లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన్ పవన్ కళ్యాణ్ వర్షంలోనే OG ఈవెంట్ లో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు OG రిలీజ్ ముంగిట ఆయన వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఏపీ లో విష జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కూడా వైరల్ ఫీవర్ బారిన పడ్డారు.
కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ తరచు ఇలా ఫీవర్ బారిన పడుతున్నారు. ఇప్పుడు మరోసారి ఆయనకు జ్వరమని తెలిసిన అభిమానులు పవన్ త్వరగా కోలుకోవాలంటూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు.