Advertisementt

సినిమా చేస్తే సరిపోదు ప్లానింగ్ ముఖ్యం

Wed 24th Sep 2025 11:14 AM
og   సినిమా చేస్తే సరిపోదు ప్లానింగ్ ముఖ్యం
Making a film is not enough, planning is important సినిమా చేస్తే సరిపోదు ప్లానింగ్ ముఖ్యం
Advertisement
Ads by CJ

ఒక పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన పెద్ద ప్రొడ్యూసర్.. ఇప్పుడొక క్రేజీ స్టార్ హీరో తో సినిమా చేసి దానిని ఎలా ప్రమోట్ చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడడం, సినిమా విడుదల ముందు వరకు ప్లానింగ్ లేని వర్క్ తో సతమతమవడం చూస్తే చాలామంది ఈయనేనా ఆస్కార్ వరకు వెళ్లొచ్చిన సినిమాని నిర్మించింది అంటూ మాట్లాడుకుంటున్నారు.

ఆయనే OG నిర్మాత దానయ్య. OG చిత్రాన్ని ఎన్నో అడ్డంకులు అధిగమించి షూటింగ్ పూర్తి అయితే చేశారు కానీ.. సినిమా రిలీజ్ సమయానికి కావాల్సిన ప్రమోషన్స్ చేయలేకపోయారు. సెప్టెంబర్ 25 అంటూ డేట్ లాక్ చేసేసి బయటపడిపోదామనుకున్నారు. కానీ OG ప్రమోషన్స్ విస్మరించారు. అది కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడడం మాత్రమే కాదు, మరోపక్క హరిబరిగా రిలీజ్ ప్లాన్ చెయ్యడం చూసిన వాళ్ళు సినిమా చేస్తే సరిపోదు ప్లానింగ్ ముఖ్యం బిగులు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

OG చిత్రం పై విపరీతమైన క్రేజ్ ఉంది, కానీ క్రేజ్ కి సరిపోయే ప్రమోషన్స్ లేవు. పవన్ ఫ్యాన్స్ OG పై ఉన్న మోజు తో ఊగిపోతున్నారు కానీ.. లేదంటే OG ని ఇలా థియేటర్స్ లోకి తీసుకొస్తే దానయ్య కు కోలుకోలేని దెబ్బ తగిలేది. ఏది ఏమైనా ఇది పవన్ కళ్యాణ్ డేట్స్ తెచ్చిన తంటానో, లేదంటే మారేదన్నా కారణమో తెలియదు కానీ.. OG విడుదలకు ముందు సుజిత్ కష్టాలు వర్ణనాతీతం. 

Making a film is not enough, planning is important:

They Call Him OG release date

Tags:   OG
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ