హాలీవుడ్ స్టార్‌ని మించిన ఫాలోయింగ్

Tue 23rd Sep 2025 01:12 PM
srk  హాలీవుడ్ స్టార్‌ని మించిన ఫాలోయింగ్
A following that surpasses that of a Hollywood star హాలీవుడ్ స్టార్‌ని మించిన ఫాలోయింగ్
Advertisement
Ads by CJ

షారుఖ్ ఖాన్ వ‌ర‌ల్డ్ లోనే ది బెస్ట్ స్టార్ల‌లో ఒక‌రిగా వెలుగొందుతున్నారు. హిందీ చిత్ర‌సీమ‌ ఐకాన్ అయిన షారూఖ్ కి పశ్చిమ దేశాలలో, ముఖ్యంగా యూరప్, ఉత్తర అమెరికాలో భారీ సంఖ్య‌లో అభిమానులు ఉన్నారు. ద‌శాబ్ధాలుగా ఖాన్ న‌టించిన‌ చిత్రాలు జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జ‌ర్లాండ్ వంటి హిందీ మాట్లాడని దేశాలలో కూడా అసాధార‌ణ‌ స్థాయిలో ప్రేక్షకులను ఆకర్షించాయి.

కింగ్ ఖాన్ షారూఖ్ కి ఎంత‌టి ఫాలోయింగ్ ఉందో గుర్తు చేసేందుకు ఒక ఉదాహ‌ర‌ణ‌ను కూడా వివ‌రించారు ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్. ఓసారి తాను, షారూఖ్ బెర్లిన్ ఫిలింఫెస్టివ‌ల్ కి హాజ‌రైన‌ప్పుడు అక్క‌డ లియోనార్డో డికాప్రియో లాంటి పెద్ద హాలీవుడ్ స్టార్ కూడా ఉన్నారు. కానీ జ‌నం షారూఖ్ చుట్టూ వ‌చ్చి చేరార‌ని అనురాగ్ క‌శ్య‌ప్ వెల్ల‌డించారు. ఖాన్ ఛ‌రిష్మా విశ్వ‌వ్యాప్త‌మైన‌దని ఆ సంఘ‌ట‌న నిరూపించింది. 

ఒకే కార్య‌క్ర‌మంలో ఉన్న బాలీవుడ్ స్టార్ కోసం హాలీవుడ్ స్టార్ ని వ‌దిలి వ‌చ్చార‌ని తెలిపారు. షారూఖ్ ఖాన్ ప్ర‌స్తుతం కింగ్ అనే చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, ఇందులో కీల‌క పాత్ర‌లో సుహానా ఖాన్ న‌టిస్తోంది. 

A following that surpasses that of a Hollywood star:

Line Lagi Thi: Anurag Kashyap Reveals Fans Waited For SRK

Tags:   SRK
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ