కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. గతంలో కత్రినా ప్రెగ్నెంట్ అన్నప్పటికి అవి గాలి వార్తలే అయ్యాయి. కానీ ఈసారి కత్రినా కైఫ్ గర్భం దాల్చింది, అతి త్వరలోనే విక్కీ కౌశల్ తండ్రిగా మారబోతున్నాడనే వార్తలు విపరీతంగా చక్కర్లు కొట్టాయి. రీసెంట్ గా విక్కీ కౌశల్ కత్రినా ప్రెగ్నెన్సీ వార్తలను కొట్టిపారేశాడు.
కానీ కత్రినా ప్రెగ్నెన్సీ ఫోటో షూట్ చేయించుకోవడం అది కాస్తా బయటికి రావడంతో మరోసారి కత్రినా తల్లికాబోతుంది అంటూ వార్తలు మొదలయ్యాయి. ఇప్పటివరకు గుట్టుగా దాచిన ఈ విషయాన్ని ఫైనల్లీ ఇప్పటికి కత్రినా - విక్కీ కౌశల్ జంట ఆ గుడ్ న్యూస్ ని రివీల్ చేసారు.
తాము తల్లితండ్రులుగా ప్రమోట్ కాబోతున్నట్లుగా ప్రకటిస్తూ కత్రినా బేబీ బంప్ ఫోటో షేర్ చేసింది ఈ జంట. వారి లైఫ్ లో అత్యంత అందమైన దశకు స్వాగతం పలుకుతున్నట్టుగా కత్రినా-విక్కీ కౌశల్ లు సోషల్ మీడియా వేదికగా గుడ్ న్యూస్ ని షేర్ చెయ్యడంతో వారి అభిమానులు, స్నేహితులు, ప్రముఖులు కత్రినా జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.