దీపికా పదుకొనె ను కల్కి సీక్వెల్ నుంచి తప్పిస్తూ మేకర్స్ తీసుకున్న నిర్ణయం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సెన్సేషన్ అయ్యింది. అసలు ఉన్నట్టుండి దీపికా పదుకొనెను ఇలా కల్కి నుంచి తప్పించడం మాత్రం భీభత్సమైన షాకిచ్చింది. అయితే దీపికా ను కల్కి మేకర్స్ తప్పించడం వెనుక దీపికా పదుకునే పెట్టిన కండిషన్స్ అనే వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
కల్కి 2 షూటింగ్ కి కేవలం ఐదు నుంచి ఏడు గంటలే హాజరవుతాను అని, అలాగే ఈ ప్రాజెక్ట్ కోసం 30 కోట్లు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ప్రాఫిట్స్ లో కాకుండా రెవెన్యూలో పర్సెంటేజ్ ఇవ్వమని దీపికా పదుకొనె కల్కి మేకర్స్ ని డిమాండ్ చేయడంతోనే ఆమెను ఉన్నట్టుండి కల్కి సీక్వెల్ ను తప్పించిన సమయంలో సందీప్ రెడ్డి వంగ ఓపెన్ గానే మాట్లాడారు. కానీ కల్కి 2 మేకర్స్ మాత్రం కమిట్మెంట్ పేరు ఎట్టి దీపికా ను తప్పించడం మాత్రం నిజంగా హాట్ టాపిక్ అనే చెప్పాలి.