బిగ్ బాస్ సీజన్ 9 మొదలై రెండు వారాలు పూర్తవుతుంది. గత వారం కామనర్స్ vs సెలబ్రిటీస్ అన్న రేంజ్ లో హౌస్ లో తగువులు జరిగాయి. కామన్ మ్యాన్ హరిత హరీష్ అయితే నాగార్జున చేత తిట్లు తిని ఆ కోపంలో అన్నం మానేసాడు. తర్వాత నామినేషన్స్ లో టార్గెట్ అయిన హారిష్.. ప్రస్తుతం అందరితో కలిసిమెలిసి తిరుగుతున్నాడు.
ఇక గత వారం అంటే ఈ సీజన్ ఫస్ట్ కెప్టెన్ గా సంజన నిలవగా ఈ వారం కెప్టెన్ ఎవరవుటారో అన్న రేంజ్ లో టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో డీమాన్ పవన్ సుమన్ శెట్టి ని ఎత్తి పడేసాడు. నా కోసం ఈవారం కెప్టెన్ అవ్వాలి అని రీతూ పవన్ ని కోరింది. దానితో రెచ్చిపోయి టాస్క్ గెలిచి పవన్ ఈ వారం కెప్టెన్ గా నిలిచాడు.
మర్యాద మనీష్, భరణి, డీమాన్ పవన్, ఇమ్మానుయేల్ ఈ నలుగురూ రెండో వారం కెప్టెన్సీ పోటీదారులుగా పోటీ పడగా.. వీరికి పెట్టిన ఫిజికల్ టాస్క్‌లో డీమాన్ పవన్ గెలివడంతో అతను హౌస్‌కి రెండో కెప్టెన్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 లో రీతూ పవన్ కి లైన్ వెయ్యడం, పవన్ రీతూ పక్కన తిరగడం తో బిగ్ బాస్ వారి నడుమ లవ్ ట్రాక్ సెట్ చేసినట్టే కనిపిస్తుంది.