కన్నడ లో అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహ. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లో విడుదలై అద్భుతమైన కలెక్షన్స్ కొల్లగొట్టింది. ప్రేక్షకులు మహావతార్ నరసింహ చిత్రాన్ని ఒక దేవుడి సినిమా చూసిన ఫీలింగ్ తో అంటే చెప్పులు కూడా లేకుండా చూసారు అంటేనే ఆ సినిమా ఎంతగా సక్సెస్ అయ్యిందో అర్ధమవుతుంది.
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన తొలి యానిమేషన్ చిత్రంగా మహావతార్ నరసింహా నిలిచి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అయితే సినిమా థియేట్రికల్ రిలీజ్ కి ముందు ఈ చిత్రాన్ని ఓటీటీలు ఏవి కొనేందుకు మొగ్గు చూపలేదు.
కానీ థియేటర్స్ లో భీభత్సమైన హిట్ అయ్యాక ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ డీల్ తో సొంతం చేసుకోవడమే కాదు.. ఇప్పుడు మహావతార్ నరసింహ ఓటీటీ డేట్ లాక్ చేసి ప్రకటించారు. సెప్టెంబర్ 19న అంటే రేపు శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది.